
కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లదలచుకున్న వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతోంది. వృత్తిపరంగా విదేశాల్లో ఇబ్బందులు పడకుండా... వారికి ఇక్కడే నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏటా రెండు వేల మందికి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. దుబాయ్‌కి చెందిన శిక్షణ సంస్థ స్నాత్, ఖతర్‌కు చెందిన మెక్‌టాన్‌తో ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీ) ఒప్పందం చేసుకుంది. గుంటూరుతో పాటు కడప జిల్లాలోని రాజంపేటలోని శిక్షణ కేంద్రాల్లో నవంబరు 20న శిక్షణ ప్రారంభించనుంది. అనంతరం వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పలు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది.
ఏడాదికి నాలుగు విడతలుగా.. విదేశీ శిక్షణ సంస్థలతో బ్యాచ్‌కు 250 మంది చొప్పున రెండు కేంద్రాల్లో ఏడాదికి నాలుగు విడతలుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణకు 18 నుంచి 50 ఏళ్లలోపు వారు అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే ప్రారంభమైంది.శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. వీటికి అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. ప్రత్యేక యాప్‌తో పర్యవేక్షణ విదేశాల్లో పనుల కోసం వెళ్లే వారిని ఏపీఎన్‌ఆర్‌టీ పర్యవేక్షించనుంది. వారి జీతభత్యాలు, వసతుల విషయాలన్నింటినీ పరిశీలించనుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను అధికారులు రూపొందిస్తున్నారు. కంపెనీలపరంగా ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరించనున్నారు. రుణం పొందేందుకు పూచీ విదేశాల్లో వసతుల కల్పన, ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు బ్యాంకు రుణం పొందే వీలు కల్పిస్తోంది. రూ.2 లక్షల వరకు బ్యాంకు పూచీగా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈ రుణం అందేలా తోడ్పాటు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు నాలుగు బ్యాంకులను సంప్రదిస్తున్నారు. * శిక్షణ ఇవ్వనున్న వృత్తి కోర్సులు: మిషనరీ(బ్లాక్, ప్లాస్టర్), ఫోర్మ్‌వర్క్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, పైప్‌ఫిట్టర్ * ఇతర కోర్సులు: కమ్యూనికేషన్ సిల్క్స్, బేసిక్ అరబిక్ లాంగ్వేజ్, డ్రాయింగ్‌లను గుర్తించడం, కంప్యూటర్ వినియోగం, ఆంగ్లభాషలో నైపుణ్యం. * ఉద్యోగ కల్పన: 20 కంపెనీలతో ఇప్పటికే ఒప్పందం * ప్రస్తుతం విదేశాల్లో ఇస్తున్నజీతం: రూ.15 వేల నుంచి 20 వేలు * శిక్షణ తర్వాత ఒప్పంద కంపెనీలు ఇవ్వనున్న జీతం: రూ.30వేల నుంచి 40 వేలు * శిక్షణ ప్రారంభం: నవంబర్ 20 * అభ్యర్థులు https://www.apnrt.com/apisdc వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. |
Source: eenadu
No comments:
Post a Comment